ఇంతా చేస్తే ..తాజ్ మహల్ ఇరవై లక్షలకే అమ్ముడైపోయిందా

updated: August 10, 2018 20:10 IST
ఇంతా చేస్తే ..తాజ్ మహల్ ఇరవై లక్షలకే అమ్ముడైపోయిందా

ఇంతా చేస్తే ..తాజ్ మహల్ ఇరవై లక్షలకే అమ్ముడైపోయిందా

కంగారుపడకండి.. ప్రేమకు నిదర్శనంగా నిలిచి ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన ఆ తాజ్ మహల్ ని ఎవరూ ఎవరికీ అమ్మేయలేదు... మరి ఈ న్యూస్ ఏంటి అంటారా.. తాజ్ మహల్ వెబ్ సైట్  (TajMahal.com)ని ఆన్ లైన్ వేలంలో ఇరవై లక్షల చిల్లరకు అమ్మేసారు. నేమ్ జెట్ అనే సంస్ద ఈ సైట్ ని సొంతం చేసుకుంది. నిజానికి తాజామహల్ వంటి ప్రపంచ వింతల్లో ఒకటైన పర్యాటక స్దలంకు సంభందించిన వెబ్ సైట్ అంటే మంచి రేటు పలకాలి కానీ అదేంటో కానీ..2009 నుంచి అమ్మకానికి పెట్టినా అమ్ముడుపోలేదు. అప్పట్లో యాభై వేల డాలర్లు అన్నారు. ఎవరూ ముందుకు రాకపోవటంతో ఇధిగో ఇలా ఓ ముప్పై వేల డాలర్లకు అంటే నలభై శాతం తగ్గించి తోసేసారు. 

అయితే   తాజ్ మహల్ లాంటి పేరున్న వెబ్ సైట్ ఎందుకు హాట్ కేకులా అమ్ముడుపోలేదు అంటే..దానికి వెబ్ సైట్ ఇండస్ట్రీ నిపుణులు చెప్పే సమాధానం ఒకటే...తాజ్ మహల్ అనగానే ఏదైనా రేపు ప్రభుత్వం తరపున నుంచి వివాదాలు రావచ్చు. లేదా..తాజ్ మహల్ టీ వారి నుంచి లీగల్ తలనొప్పులు ఎదురు కావచ్చు. అంత డబ్బు ఖర్చు పెట్టి..తర్వాత వివాదాల్లో ఇరుక్కుంటే కలిసివచ్చేదేముంటుంది మీడియాకు ఎక్కటం తప్ప..అని ఆలోచించే ఎవరూ ధైర్యం చేయలేదని అంటారు. ఇందులో నిజమెంతో తెలియదు కానీ TajMahal.com అనేది బ్రహ్మాండమైన సైట్ అవుతుందని, సరిగ్గా డీల్ చేస్తే డబ్బులే డబ్బులు అని కొందరు కామెంట్స్ పాస్ చేసేస్తున్నారు. 


Tags: Taj Mahal, Tajmahal.com

comments