రెండు కోట్లు పైగా రేటు పలికిన డొమైన్ పేరు ఏంటో తెలుసా

updated: February 24, 2018 23:25 IST

సరైన డొమైన్ నేమ్ కు ఎంత వ్యాల్యూ ఉంటుందో,   ఎంత మార్కెట్ ఉంటుందో వెబ్ ప్రపంచంలో జనాలకి తెలుసు. అయితే వారు ఊహించని రేట్లుకు కూడా ఒక్కోసారి కొన్ని డొమైన్స్ నేమ్స్ అమ్ముడుపోతాయి. తాజాగా  Inspection.com అనే సైట్ ని హాంకాంగ్ కు చెందిన ఆసియన్ ఇన్సెపిక్షన్ అనే కంపెనీ 335,000 డాలర్లు అంటే మన ఇండియన్ రూపాయల్లో దాదాపు  2, 16,78,017 కు కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని కేట్ బక్లీ అనే మధ్యవర్తి  సోషల్ మీడియా ద్వారా వెల్లడి చేసారు.

 

ఈ కంపెనీ చైన్ టైక్నాలిజీ ని సప్లై చేస్తూంటుంది. తమ వ్యాపార విస్తరణలో భాగంగా  తాము ఆల్రెడీ వినియోగిస్తున్న AsiaInspection.com ని అప్ గ్రేడ్ చేయటం కోసం ఈ డొమైన్ ని కొనుగోలు చేసింది. తమ పాత వెబ్ సైట్ పేరు కు ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేసిన పేరు దగ్గరగా ఉండటంతో దీన్ని కొన్నామని ఆ సంస్ద ప్రతినిధులు వెల్లడించారు. ఈ డొమైన్ ని 2008లో రిజస్టర్ చేసారు. ఈ డొమైన్ తో తమ వ్యాపారం పెరుగుతుందని కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి.

comments