మీకు నచ్చిన డొమైన్ ని గూగుల్ ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలుసా?

updated: March 25, 2018 18:47 IST
మీకు నచ్చిన డొమైన్ ని గూగుల్ ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలుసా?

ఇంటర్నెట్ అనేది ఈ రోజున  ఇంటింటి విషయం.  ఇంటర్నెట్ ప్రపంచంలోని ఎందరినో కలుపుతోంది. అదే సమయంలో వ్యక్తిగతమైన సామాజిక, రాజకీయమైన, ఆర్ధికమైన విషయంగా మారి ఎన్నో ఫలితాలు అందిస్తోంది. అయితే మనకంటూ ప్రత్యేకమైన ఐడింటిటీ కావాల్సి వచ్చినప్పుడు...సొంత వెబ్ సైట్ మనకూ ఇంటర్నెట్ లో ఉంటే బాగుండును అనిపిస్తుంది.  

ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఈ పోటీ ప్రపంచంలో తమ స్థానాన్ని పదిలం చేసుకోవాలంటే తమని తామే ప్రమోట్ చేసుకోవలసిన పరిస్థితి ప్రతీ ఒక్కరికీ ఏర్పడింది. ఇంతకు ముందు వెబ్ సైట్లను కేవలం వాణిజ్య అవసరాలు లేదా సెలబ్రెటీలకే సొంత అన్నట్లుగా ఉండేది. ఈ రోజున చిన్న ప్రాడెక్ట్ లు ప్రమోట్ చేసుకోవాలన్నా...కళాకారులు తమ కళను నలుగురికి తెలిసేలా చెయ్యాలన్నా వెబ్ సైట్ తప్పనిసరి అయ్యింది. అయితే వెబ్ సైట్ సొంతం చేసుకోవటం చాలా ఖర్చుతో, కష్టంతో కూడుకున్న పని చాలా మంది భావిస్తారు. అయితే కొత్త వెబ్ సైట్ ని సొంతగా తమకు తామే తమకు నచ్చిన పేరుతో రిజిస్టర్ చేసుకోవచ్చు అనే విషయం చాలా మందికి తెలియదు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో చేరినంత సులభంగా మీరూ ఒక వెబ్ సైట్ పెట్టుకోవచ్చు.
 
ముఖ్యంగా డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి godaddy.com, bigrock.com, reisgter.com లాంటి వెబ్ సైట్లు వెయ్యికు పైగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో గూగుల్ వాడు కూడా ఈ ఫీల్డ్ లోకి రావటం జరిగింది. 

https://domains.google.com/  కేవలం 860 రూపాయలు ఛార్జ్ చేస్తూ డొమైన్ రిజిస్టర్ చేస్తోంది. మిగతావాటికి గూగుల్ లో రిజిస్టర్ చేసుకుంటే వచ్చే బెనిఫిట్ లలో తేడా ఏంటంటే...డొమైన్ ప్రైవసీ కోసం మిగిలిన కంపెనీలు వాళ్లు ఎగస్ట్రా ఛార్జ్ చేస్తారు. గూగుల్ వాడు ప్రైవసీ ప్రొటక్ట్ ఫ్రీగా ఇస్తాడు. గూగుల్ ఈ బిజినెస్ లోకి రావటంతో చాలా మంది చిన్న చిన్న డొమయిన్ రిజిస్ట్రేషన్ కంపెనీలు భయపడుతున్నాయి. ఈ సర్వీస్ ని గూగుల్ స్టార్ట్ చేసి మూడేళ్లు అయ్యింది. మొదట్లో యుఎస్ ఎ వరకే ఉందేది. ఈ మధ్యనే ఇండియాకు వ్చచింది. అందుకు కారణం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కావచ్చు. ఆయన ఇండియన్. 
 


Tags: Google domains, bigrock, godaddy, free privacy registration

comments